తమ పిల్లలకు జీవిత భాగస్వామిని వెతికే ప్రక్రియలో తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలు
వధువు/ వరుడు కి పెళ్లి సంబంధం చూడటానికి వచ్సిన తల్లిదండ్రులను, "వారు తమ పిల్లల వద్ద అనుమతి తీసుకున్న తరవాతనే, వారికి వివాహ సంస్థలు లేక, matrimonial sites లేక, మధ్యవర్తి ద్వారా సంబంధాలు వెతుకుతున్నారా" అని నేను వారిని ప్రశ్నిస్తాను. తల్లిదండ్రులు తమ పిల్లలకి వివాహం చేయాలనే తమ కోరిక ఒక్కటి సరిపోతుంది అనే ఉద్దేశ్యంతో నా ప్రశ్నకు ఆశ్చర్యపోవటం కానీ, చిరాకుపడటం కానీ, విస్మయం చెందటంకానీ జరుగుతుంటుంది.
నిజముగా జరిగిన కథ : శ్రీ. జోషి కొన్ని సంవత్సరాల క్రితం, ఆందోళనతో మా ఆఫీసుకి వచ్చ్చారు. కారణం, వారి కుమారుడు రితేష్ వారితో కోపంగా వున్నారు. నిజానికి, శ్రీ. జోషి, అతని కుమారుని అనుమతి లేకుండా, అతని కోసం సంబంధం వెతకటం ప్రారంభించారు. రితేష్, 27 ఏళ్ల యువకుడు, అప్పటికే ఒకరిని ఇష్టపడుతున్న విషయం అతని తండ్రికి తెలుపలేదు. శ్రీ. జోషి రితేష్ కొరకు ఒక మంచి సంబంధంతో పెళ్లి చూపులు ఏర్పాటు చేసినప్పుడు, ఇది ఒక పెద్ద గొడవకు దారి తీసింది. రితేష్ కు, అతని తండ్రి, అతని భావాలను మరియు ప్రస్తుత relationship ను నిర్లక్ష్యం చెసిన భావన కలిగింది. దీని వలన వారి ఇరువురి మధ్యన తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
దీనిని బట్టి మనకి, తల్లిదండ్రులు పిల్లలకు జోడీను వెతకటం మొదలుపెట్టక మునుపు, వారికి తమ పిల్లలతో ప్రాథమిక సంభాషణ కలిగి ఉండటం అత్యవసరం అని అర్ధం అవుతుంది. పిల్లలు పెళ్ళికి సిద్ధముగా ఉన్నారా, వారు ఎవరినైనా ఇష్టపడుతున్నారా, లేక వారికి ఏమైనా preferences ఉన్నాయా, ఇలాంటి విషయాలు కనుక్కోవాలి. చాలా మంది యువతీ యువకులు, తమ ఎంపిక గురించి ఒక ఖఛ్చితమైన నిర్ణయానికి వచ్చేంత వరకు తమ డేటింగ్ జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచటానికి ఇష్టపడతారు. అలాగే, వారికి జీవిత భాగస్వామిని వెతికే ప్రక్రియలో వారి ప్రమేయం లేకపోవటం వలన అపార్ధాలకు దారి తీయవచ్చు.
తల్లిదండ్రులు తమ పిల్లలకు వివాహ సంబంధాలు వెతకటానికి మునుపే వారిని సంప్రదించి వారి నుంచి పూర్తి అనుమతిని తీసుకోవటం ఎంతో అవసరం. వారి ఇష్టాలు, సంసిద్ధత మరియు ప్రాధాన్యతల గురించి కనుక్కోండి. వారు ఎవరినైనా ఇష్టపడుతున్నారా లేక నిర్దిష్ట ఎంపికను కలిగి ఉన్నారా, ఇలాంటి వాటిని పరిగణలోకి తీసుకోవటానికి సిద్ధంగా ఉండండి. నేటి తరానికి చాలా స్వాతంత్ర్యం ఉంది, కావున మారుతున్న సంస్కృతి ప్రకారం తల్లిదండ్రులు తమ దృక్పథాన్ని మార్చుకునే సమయం ఆసన్నమైంది. కొన్నిసార్లు, “కొన్ని విషయాలు ఎప్పటికీ మళ్లీ పాతకాలపు వాటిలా మారలేవు” అనే వాస్తవాన్ని అంగీకరించాల్సి వస్తుంది.
12th November, 2024
Leave a Comment