రుక్మిణీ స్వయంవరం : ఒక ప్రేమ మరియు భక్తి కూడిన గాథ

రుక్మిణీ స్వయంవరం : ఒక ప్రేమ మరియు భక్తి కూడిన గాథ

"రుక్మిణీ స్వయంవర్" అనే పవిత్ర గ్రంథం మొదట మరాఠీలో ప్రచురణలో వుంది. ఇది శ్రీ కృష్ణుని మహిమాన్వితమైన లీలలను వివరిస్తుంది, ముఖ్యంగా శ్రీ కృష్ణుని మరియు రుక్మిణి దేవి వివాహం గురించి.

సంత్ ఏకనాథ్, 764 శ్లోకాలతో కూడిన "రుక్మిణీ స్వయంవర్" గ్రంథాన్ని రచించారు. ఏక్‌నాథ్ ప్రముఖ మరాఠీ సన్యాసి, పండితుడు మరియు వార్కరీ సంప్రదాయానికి చెందిన మత కవి.

రుక్మిణి దేవి స్వయంవరం సమయంలో, శ్రీ కృష్ణుడు తనని ఎలా తీసుకువెళ్ళాడు అన్నది కథ.

రుక్మిణి దేవి విదర్భ (మహారాష్ట్ర, భారతదేశం) రాజు, భీష్మక కుమార్తె. ఆమెకు రుక్మి, రుక్మరత, రుక్మకేతు, రుక్మబాహు మరియు రుక్మనేత్ర అనబడే ఐదుగురు సోదరులు ఉండేవారు. వారి అందరిలోకి  చిన్నది రుక్మిణి దేవి. ఆమె చాలా అందమైనది మరియు నారాయణునికి నిజమైన భక్తులలో ఒకర్తె. ఆమె దేవశ్రీ నారద ముని నుండి శ్రీ కృష్ణ లీలల గురించి విన్నప్పుడు, కృష్ణుని ప్రేమలో పడిపోయింది. అతనిని వివాహమాడాలని తలచింది. కానీ ఆమె పెద్ద అన్నయ్య రుక్మి శ్రీ కృష్ణుని ఎన్నడూ ఇష్టపడలేదు. అతను శిశుపాలునితో రుక్మిణి దేవి వివాహాన్ని నిర్ణయించాడు.

చింత చెందిన రుక్మిణి దేవి, నారద ముని ద్వారా శ్రీ కృష్ణునికి లేఖ పంపింది, " హే కృష్ణ భగవాన్, నేను నీ పాద పద్మముల వద్ద ​​శరణాగతి పొందితిని. నీవు చాలా దయగలవాడవని నాకు తెలుసు. దయచేసి వచ్చి నన్ను నీ లోకానికి చేర్చు. నేను నిన్ను నా భర్తగా స్వీకరించాను, ఇప్పుడు నేను ఆ స్థానంలో వేరెవ్వరినీ ఊహించుకోలేను, కాబట్టి శిశుపాలుడు నన్ను తాకకుండా, దయచేసి ఇక్కడికి వచ్చి నన్ను స్వీకరించు”.

వెంటనే శ్రీకృష్ణుడు తన అన్నగారు బలరామునితో కలిసి ద్వారక నుండి వచ్చాడు. అతను రుక్మిణి దేవిని ఆమె స్వయంవరం నుండి తీసుకువెళ్ళాడు.

రుక్మిణి సోదరుడు రుక్మి వారిని వెంబడించడం ప్రారంభించాడు. శ్రీ కృష్ణుడు రుక్మి మరియు శిశుపాలునితో యుద్ధం చేసాడు. కృష్ణుడు రుక్మిని చంపబోతుండగా, రుక్మిణి కృష్ణుడి పాదాలపై పడి తన సోదరునికి ప్రాణ భిక్ష పెట్టమని వేడుకుంది. కృష్ణుడు, ఎప్పటిలాగే ఉదార హృదయుడై, అంగీకరించాడు, కానీ శిక్షగా, రుక్మి తల గుండు చేసి, అతనిని విడిచిపెట్టాడు. ఒక యోధునికి ఇంతకు మించిన ఓటమి యొక్క అవమానము ఉండదు.             

శ్రీకృష్ణుడు మరియు రుక్మిణి దేవి ద్వారకకు వచ్చి వివాహం చేసుకున్నారు. ద్వారకలో ఒక గొప్ప వేడుక జరిగింది.

 

మారుతున్న కాలంతో పాటు, మీలో చాలా మందికి ఈ ప్రసిద్ధ పౌరాణిక గాథ చాలా సాధారణంగా అనిపించవచ్చు. కానీ ఆ సమయంలో అనగా, ద్వాపరయుగంలో, ఒక వధువు తనంతట తానే, తన వివాహము నిశ్చయించుకోవటం, తన కిడ్నాప్‌ను తానే ప్లాన్ చేయటం మరియు తాను ఎన్నడూ చూడని మనిషి గురించి కేవలం కథలు వింటూ తన హృదయంతో అతనిని నమ్మి, అతనితో పారిపోవటం, ఇవ్వన్నీ ఖచ్చితంగా సాధారణమైన విషయాలు కావు. రుక్మిణి దేవి శ్రీ కృష్ణుని గాఢంగా ప్రేమించింది, అతనిని గౌరవించింది, నమ్మింది మరియు చివరి క్షణం వరకు అతని కోసం ఓపికగా వేచి చూసింది. ఆమె తన జీవితాన్ని కేవలం భార్యగానే కాకుండా నిజమైన భక్తురాలిగా ఆయనకు అంకితం చేసింది. అదే విధంగా, శ్రీకృష్ణుడు కూడా ద్వారక నుండి ఒక సందేశంతో ఆమె కొరకు వచ్చాడు. అతను ఆమెను రక్షించాడు, తన హృదయంలో మరియు జీవితంలో ఆమెకు గౌరవనీయమైన స్థానాన్ని ఇచ్చాడు.

చాలా మంది ఈ “రుక్మిణీ స్వయంవరం” గ్రంథాన్ని చదవటం లేదా పారాయణం చేయడం ద్వారా వివాహ సంబంధిత సమస్యలు సులభంగా పరిష్కరింపబడతాయి అని నమ్ముతారు. అయితే ఈ పుస్తకాన్ని చదవడం వలన రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవు. ఈ కథ యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవాలి. ఒక వివాహం శాశ్వతంగా మరియు విజయవంతంగా నిలవాలంటే, వివాహిత జంట మధ్యన పరస్పర గౌరవం, ప్రేమ, విశ్వాసం మరియు మద్దతు అవసరం. కానీ ఆధునిక వధూవరుల మధ్యన మారుతున్న ప్రాధాన్యతలతో, ఈ ముఖ్యమైన విలువలు ఎక్కడో కోల్పోతున్నాయి, ఫలితంగా వారి వైవాహిక జీవితంలో చాలా ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

మీరు సరైన జీవిత భాగస్వామి కోసం తారసపడుతున్నప్పుడు మీ మార్గంలో పదేపదే వైఫల్యాన్ని ఎదుర్కొంటున్నట్లయితే, ఈ పుస్తకం మీకు వధువు/ వరుని శోధనలో సహాయపడవచ్చు. మీరు మిస్టర్ లేదా మిస్ perfect కోసం వెతకడం ప్రారంభించే ముందు, ఈ కథలో శ్రీకృష్ణుడు మరియు రుక్మిణి దేవి వ్యక్తీకరించిన లక్షణాలతో మిమ్మల్ని మీరు సరి దిద్దుకోవాలి. అటువంటి పుస్తకాన్ని చదవటం ద్వారా, ఉపచేతనంగా మీరు మీలో ప్రేమ, గౌరవం, నమ్మకం మరియు మద్దతులను పొందుతారు. ఎందుకంటే విజయవంతమైన వివాహాన్ని నిర్మించడానికి ఈ నాలుగు స్తంభాలు ప్రధానమైనవి.

 

 

  25th November, 2024

Leave a Comment