వివాహ సంబంధాలు వెతికేటప్పుడు గోత్రానికి ఎంత ప్రాధాన్యతను ఇవ్వాలి?
ఒకే గోత్రంలో వివాహం
పాఠక్ గారు మరియు వారి శ్రీమతి, వారి పెద్ద కుమార్తె రీనా కొరకు వివాహ సంబంధాలు వెతకటానికి నా కార్యాలయానికి విచ్చేసారు. 33 ఏళ్ల వయస్సుగల రీనాకి వారు సరైన జోడీని వెతకటంలో ఇబ్బంది పడుతున్నట్టు నాకు తెలిపారు. నేను వారి కుటుంబం గురించి అడిగినప్పుడు, రీనాకు ఒక చెల్లెలు ఉందని, ఆమెకు అప్పటికే వివాహం అయ్యి రెండేళ్ల పాప కూడా ఉందని నాకు తెలిసింది.
నేను ఆశ్చర్యంగా, “ఆమె చెల్లెలికి ఇంత త్వరగా పెళ్లి ఎలా జరిగింది?” అని అడిగాను. పాఠక్ గారు ఇలా వివరించారు, “ఆమెది ప్రేమ వివాహం, ఇప్పుడు మేము రీనా పెళ్లి గురించి ఆందోళన చెందుతున్నాము. మీరు ఆమెకు ఏదైనా మంచి సంబంధం చూసి పెట్టగలరా? ”
నా దగ్గర, వారి అంచనాలకు అనుగుణంగా ఎన్నో ప్రొఫైల్స్ వున్నాయి. వాటిలో రీనాకు నితిన్ సరిగ్గా సరిపోతాడని నాకు అనిపించింది. నేను నితిన్ గురించి వారికి చెప్పినప్పుడు, వారు సంతోషించారు. రీనాకి అతని ఫోటో కూడా నచ్చింది. అయితే, జాతకాలు తనిఖీ చేసిన తరువాత, పాఠక్ గారు నిరాశగా చూస్తూ ఇలా అన్నారు, “రెండు కుటుంబాలు ఒకే గోత్రానికి చెందినందు వలన, మేము ఈ సంబంధాన్ని ఒప్పుకోలేము. కాబట్టి ఇది సరైన మ్యాచ్ కాదు.”
వారి తిరస్కరణల పరంపర కొనసాగింది. వారు ఆదాయం, చంద్ర రాశి, నక్షత్రం, నాడి, గోత్రం వంటి అంశాల ఆధారంగా ప్రతి ప్రొఫైల్‌ను తూచి చూసారు. ఈ నిరంతర పరిశీలన నిరాశకు దారితీసింది.
నేను శ్రీ పాఠక్‌ను అడిగాను, “మీరు మీ చిన్న కుమార్తె వివాహం కొరకు ఈ వివరాలను తనిఖీ చేసారా?” అతను ఇలా బదులిచ్చారు, "లేదు, అది ప్రేమ వివాహం కావటం వలన, మేము జాతకాలు, లేక ఇతర సాంప్రదాయపు గణనలను తనిఖీ చేయలేదు."
నేను సూచించాను, “నితిన్ ప్రొఫైల్‌ను ఎందుకు పునఃపరిశీలించకూడదు? జాతకాలు కుదురుతున్నాయి, మరియు కుటుంబాలు భిన్నంగా ఉన్నాయి. సమస్య ఏమిటి?" దురదృష్టవశాత్తూ, శ్రీ పాఠక్ గోత్రానికి సంబంధించిన తన నమ్మకంలో దృఢంగా ఉన్నారు.
నేను జ్యోతిష్యాన్ని లోతుగా పరిశోధించదలుచుకోలేదు, కానీ గోత్రం అంటే ఏమిటో వారికి స్పష్టం చేయాలనుకున్నాను. నేను శ్రీ మరియు శ్రీమతి పాఠక్ లను అడిగాను, వారు దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారా అని. శ్రీ పాఠక్ వివరించారు, “అవును, సత్యయుగం నుండి ఋషుల నుండి గోత్రాలు ఉన్నాయి. ఒకే గోత్రానికి చెందిన వ్యక్తులు తోబుట్టువుల వంటివారు, కాబట్టి మేము ఈ సంబంధాన్ని consider చెయ్యలేము”.
గోత్రం పురాతన ఋషుల నుండి వచ్చిన వంశాన్ని సూచిస్తుందని, శ్రీ పాఠక్‌తో నేను ఏకీభవించాను. సంభావ్య జన్యుపరమైన సమస్యల కారణంగా ఒకే గోత్రానికి చెందిన వ్యక్తుల మధ్య వివాహాలను సంప్రదాయం నిరోధిస్తుంది.
కానీ, సత్యయుగం నుండి మనముండే కలియుగం వరకు మన జీవితాల్లో అనేక మార్పులు రూపుదిద్దుకున్నాయని నేను సూచించాను. వేల సంవత్సరాలుగా, దండయాత్రలు మరియు మారుతున్న సాంస్కృతిక పద్ధతుల కారణంగా సమాజం రూపాంతరం చెందింది. వీటిలో ప్రేమ మరియు కులాంతర వివాహాలు కూడి ఉన్నాయి.
నేను వారిని అడిగాను, “ప్రతి గోత్రం యొక్క స్వచ్ఛతను నిర్ధారించడం నిజంగా సాధ్యమేనా? వైద్యపరంగా, జన్యుపరమైన ప్రమాదాల కారణంగా దగ్గర బంధువులను వివాహం చేసుకోకపోవడమే ఉత్తమం. కానీ ఒకే గోత్రం కలిగి వేర్వేరు కుటుంబాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ సమస్యను ఎదుర్కొనే అవకాశం తక్కువ. ఇలాంటి జంటలు చాలా మంది సంతోషకరమైన జీవితాన్ని గడుపుతూ ఆరోగ్యకరమైన పిల్లలను కూడా కలిగి ఉంటున్నారు.
శ్రీ పాఠక్ నా మాటలను ఆలకించారు. మా సంభాషణ ముగిసే సమయానికి, అతను మెల్లగా అన్నారు, "రీనాకు నితిన్ సరైన జోడీ అని నేను అనుకుంటున్నాను."
12th November, 2024
Leave a Comment