జీవిత భాగస్వామిని ఎంచుకోవటానికి సులభమైన నియమాలు

క్రింద సూచించిన సులభమైన నియమాలతో మీ జీవిత భాగస్వామిని ఎంచుకొనే ప్రక్రియ తెలికపడి, మానసిక ఒత్తిడి కూడా  తగ్గుతుంది.

 

తగిన జీవిత భాగస్వామిని ఎంచుకోవడం అనేది ఈ రోజుల్లో అత్యంత క్లిష్టమైన పనుల్లో ఒకటిగా మారింది. మునుపటి రోజులతో పోలిస్తే, ఈ నిర్ణయం ప్రధానంగా కాబోయే వధూవరులపై ఆధారపడి ఉంటోంది. కానీ సరైన భాగస్వామిని ఎంచుకోవటం ఇప్పుడు ఒక రోలర్ కోస్టర్ రైడ్‌లా మారింది.

 

ఎవరికైనా అంచనాలు ఉండటం సహజం. దురదృష్టవశాత్తూ, నేటి వధూవరులు అవాస్తవికమైన మరియు ఊహాత్మక అంచనాలను కలిగి ఉంటున్నారు, వాటిని వాస్తవంలోకి తీసుకు రావటం చాలా కష్టం. కావున, నేటి కాబోయే వధూవరులు తమ వివాహము మరియు జీవిత భాగస్వామిని  ఎంచుకొనే భావనల గురించి పూర్తిగా అయోమయంలో పడటంలో ఆశ్చర్యం లేదు.

 

మనం తగిన జీవిత భాగస్వామిని ఎంచుకోవటంలో కొన్ని ముఖ్యమైన అంశాలను పరిగణలోకి తీసుకోవాలి:

 

1.     మీ భవిష్యత్తు జీవిత భాగస్వామి నుండి ఏమి ఆశించాలో తెలుసుకోవాలంటే, ముందుగా మీ గురించి మీరు తెలుసుకోవాలి.

 

2.     అన్ని విషయాలను సరిపోల్చడానికి ప్రయత్నించకండి, ఎందుకంటే "భిన్న ధ్రువాలు ఆకర్షిస్తాయి" అనే సూత్రం ఇక్కడ పని చేస్తుంది.

 

3.     మీరు కేవలం పాజిటివ్ లేదా నెగటివ్ లక్షణాలను మాత్రమే కాకుండా, పరస్పర అనుకూలతను కూడా పరిగణలోకి తీసుకోవాలి.


4.     భావోద్వేగాలు, ఆలోచనలు, డబ్బు, ఆరోగ్యం ఇవన్నీ మారవచ్చు, కానీ స్వభావం అంత సులభంగా మారదు. కాబట్టి దృష్టి సంపూర్ణతపై ఉండాలి.

  12th November, 2024

Leave a Comment